Tuesday 4 September 2012

ఈ క్రింది వ్యాఖ్యానములు 'శ్రీ ఎక్కిరాల భరద్వాజ' గారు వ్రాసిన "శ్రీ సాయి లీలామృతం" (24వ అధ్యాయంలో) అనే పుస్తకం నుండి తీసుకొనబడినవి.




మార్పు అనేది సహజం, కానీ మార్పు మనల్ని ఎటువైపు  తీసుకువెళుతుంది అనేది కూడా ముఖ్యం. మన ఆలోచనలు ఎందుకని మారుతున్నాయి? దేని వలన మారుతున్నాయి?

మనం బాగుపడాలని కోరుకోవచ్చు. మనం డబ్బు సంపాదించాలనుకోవటం మంచిదే, కానీ పక్కవాడిని తొక్కి లేదా చంపి (వీలైనంత త్వరత్వరగా) డబ్బు సంపాదించాలనే ధోరణి పెరుగుతుంది. మనకి డబ్బు మీద ఆశ ఉండవచ్చు, కాని అత్యాశ ??? మనం బతకాలి, వీలైతే ఇంకో నలుగురిని బతికించాలి (వేరేవారికి/సమాజానికి నష్టం రాకుండా). మనం భావితరాల వారికి ఎటువంటి సమాజాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం?

మనం ఒక పని చేసేటప్పుడు అది మంచిదో కాదో మనకి తెలియదా? మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు జరుగుతుంది. ఈ విషయం కూడా చాలా మందికి తెలుసు. మరి తెలిసి ఎందుకు చేస్తున్నాం? మనం ఇవ్వాళ దేని గురించి ఆనందపడుతున్నమో, తర్వాత దాని వలనే బాధపడే అవకాశం ఉండవచ్చు. రానురాను సమాజంలో పాపభీతి తగ్గిపోతుంది. మనం తప్పు చేస్తే ఎవడు ఏమి చేస్తాడు అనే తత్త్వం తగ్గిపోతుంది.

మనకి బలం ఉన్నదని, అధికారం ఉన్నదని, డబ్బు ఉన్నదని, వయసు ఉన్నదని (ఇంకా మొ॥ నవి ) ఇష్టం వచినట్లు ప్రవర్తిస్తే పరమేశ్వరుడు వీటినన్నిటిని లెక్క వేస్తూ ఉంటాడు. చేసిన పనులుకు మళ్లీ ఎన్నికోట్ల కోట్ల జన్మల తర్వాత ఈ మానవ జన్మ వస్తుందో!!!             ---- శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. 

గమనిక:  ఇంగ్లీష్ వర్షన్ బ్లాగ్ కూడా ఉంది. తెలుగు వర్షన్ని అలాగే డబ్ చేయకుండా ఇంగ్లీష్ వర్షన్ని మార్చి రాయటం జరిగింది. ఇంగ్లీష్ వర్షన్ కొరకు ఈ పక్కనున్న లింక్ క్లిక్ చేయండి valuesversusmoney

Note:
          Return to the main list, listOfBlogs